కామెడీ ఎంటర్‌టైనర్‌లా విడుదలైన ‘జాతి రత్నాలు’ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో ఎంతో విజయవంతమైంది. అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలై నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్నట్లు నిర్మాణ సంస్థ ‘వైజయంతి మూవీస్’ తెలిపింది. చింతకాయ రసమ్… తెలుగు ప్రేక్షకులు ఆసమ్ అంటూ ట్వటర్‌లో పోస్టర్ పెట్టింది. కాగా నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం తదితరులు నటించారు.