ఇండియా నుంచి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి అధికారికి ఎంట్రీ రానందుకు చాలా బాధేసిందని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. కానీ దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదని చెప్పుకొచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..‘‘ఛెల్లో షో’ ఆస్కార్ షార్ట్ లిస్టులో స్థానం దక్కించుకున్నందుకు ఆనందంగా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ ఎంట్రీ ఇచ్చి ఉంటే బాగుండేదని విదేశీయులు కూడా అనుకుంటున్నారు. కానీ ఎఫ్ఎఫ్ఐ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందే,’’ అంటూ పేర్కొన్నారు.