2023లో జరిగే వన్డే వరల్డ్ కప్‌కు భారత జట్టును ఎంపిక చేయడం కత్తిమీద సామె అని పేర్కొన్నారు భారత జట్టు తాత్కాలిక కోచ్ VVS లక్ష్మణ్. భారత రిజర్వ్ బెంచ్‌లో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని, వాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో ఆడుతున్న జట్టు కూడా బలంగా ఉందని, కానీ సీనియర్లు వస్తే పోటీ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అటు కోచ్‌గా తనకు బాగానే ఉందని పేర్కొన్నారు లక్ష్మణ్.