తను దర్శకత్వం వహించి నిర్మించిన ‘సింధూరం’ సినిమా అప్పులు తీర్చడానికి ఐదేళ్లు పట్టిందని డైరెక్టర్ కృష్ణవంశీ అన్నారు. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుండటంతో ఓ నెటిజన్ ‘సింధూరం’ మూవీని రీ రిలీజ్ చేయాలని కృష్ణవంశీని అడిగాడు. దానికి సమాధానంగా ఆయన ఈ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. కాగా 1997లో సింధూరం మూవీ విడుదల అయింది. ఈ చిత్రంలో రవితేజ, బ్రహ్మాజీ, సంఘవి ప్రధాన పాత్రల్లో నటించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయింది.
-
Courtesy Twitter: chinni
-
Courtesy Twitter: Ragalahari