మెగాస్టార్ చిరంజీవి తాను చేయాల్సిన ఓ పాత్రకు హీరో రాజశేఖర్‌ను రికమెండ్ చేశారు. అప్పట్లో విడుదలైన ఒరు సీబీఐ డైరీ కురిప్పు చిత్రం రైట్స్‌ను కొనుగోలుకు రాజశేఖర్ ప్రయత్నించారట. కానీ, అల్లు అరవింద్ అప్పటికే తీసుకోవటంతో నిరాశ చెందారు. అందులో చిరంజీవి నటించాలి. కానీ, కాల్షీట్స్ కుదరకపోవటంతో రాజశేఖర్‌ను తీసుకోవాలని సూచించారట. ఈ విషయాన్ని స్వయంగా రాజశేఖర్ తెలిపారు. సినిమా పూర్తైన తర్వాత ఆయనకు కృతజ్ఞతలు చెప్పినట్లు వెల్లడించారు.