RBI కీలక రెపోరేట్‌ను మరో 35 బేసిస్ పాయింట్లు పెంచడంతో మధ్య తరగతివారి సొంతిటి కల, కలగానే మిగిలిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. ₹40లక్షల హోమ్‌లోన్ తీసుకుంటే ఏప్రిల్‌లో వడ్డీరేటు 6.50శాతంగా ఉండేది. ఇప్పడది 8.75 శాతానికి చేరనుంది. ఇప్పటికే ఇల్లు కొని EMI కడుతున్న వారికీ కష్టాలు తప్పట్లేదు. వడ్డీ రేటు పెరిగితే బ్యాంకులు EMI పెంచకుండా కాలపరిమితిని పెంచుతాయి. అంటే ₹40లక్షలు లోన్ తీసుకుని 20 ఏళ్ల పాటు కట్టాల్సి ఉందనుకుందాం. ఇప్పుడు పెరిగిన రేటుతో వారు 43 ఏళ్లు EMI కట్టాల్సి ఉంటుంది.