ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఈజ్ బ్యాక్. రంజీ ట్రోపీ ఫైనల్ లీగ్ కోసం జడ్డూ చెన్నైకి వచ్చాడు. ఈ నేపథ్యంలో ‘వణక్కం చెన్నై’ అంటూ జడేజా ట్వీట్ చేశాడు. దీంతో చెన్నై ఫ్యాన్స్ హుషారుగా స్వాగతం పలికారు. ‘వెల్ కం బ్యాక్ టు చెన్నై’ అంటూ రిప్లై ఇస్తున్నారు. మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఆటను మెరుగుపరుచుకుంటున్నాడు. ఆసీస్ పర్యటన నేపథ్యంలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఈ మేరకు జడ్డూ ఓ వీడియోను పంచుకున్నాడు. ఫిబ్రవరిలో ఆసీస్తో జరగనున్న టెస్టు సిరీస్కు జడేజా ఎంపికైన సంగతి తెలిసిందే.