వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత స్పిన్ ఆల్‌రౌండర్ల ద్వయం జడేజా, అశ్విన్‌లలో ఒకరినే జట్టులోకి తీసుకోవాలని దినేష్ కార్తిక్ సూచించాడు. ‘మ్యాచ్ ఇంగ్లాండ్‌లో జరగనున్న దృష్ట్యా అక్కడి పేస్ పిచ్‌లకు అనుగుణంగా జట్టు కూర్పు ఉంటుంది. దీంతో అశ్విన్, జడేజాలలో ఒకరు జట్టులో ఉండరు. అశ్విన్ కన్నా జడేజా బాగా బ్యాటింగ్ చేయగలడు. శార్దూల్ ఠాకూర్ జట్టుతో కలవొచ్చు. అక్షర్‌కి అవకాశం ఉండకపోవచ్చు’ అని డీకే అభిప్రాయం వ్యక్తం చేశాడు. జూన్ 7-11 వరకు ఫైనల్ జరగనుంది. 2021 ఫైనల్‌లోనూ జట్టు కూర్పలో సమస్య కారణంగా భారత్ ఓటమి పాలైంది.