ఐపీఎల్‌లో చెన్నై ఓటమికి జడేజాను కారణంగా చూపుతున్నారంటూ సోషల్‌మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. గాయం కారణంగా టీ20 లీగ్‌కు దూరమైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చెన్నై ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను అన్‌పాలో అయ్యాడని వార్తలు వచ్చాయి. ఆ వెంటనే చెన్నై కూడా జడేజాను అన్‌ఫాలో అయినట్లు టాక్. దీంతో చైన్నై జట్టుకు, జడేజాకు ఉన్న విభేదాల కారణంగానే ఇలా జరిగిందని చెప్తున్నారు. చెన్నై సీఈఓ విశ్వనాథన్ కూడా దీనిపై స్పందించలేదు. ఇకపై మళ్లీ జడేజా చెన్నై జట్టులో ఆడకపోవచ్చని చర్చ నడుస్తుంది.