రంజీ ట్రోఫీలో టీమిండియా మాజీ క్రికెటర్ కెదార్ జాదవ్ అదరగొట్టాడు. మహారాష్ట్ర తరఫున బరిలోకి దిగిన జాదవ్ ఏకంగా డబుల్ సెంచరీ చేసేశాడు. 283 బంతుల్లో 283 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ట్రిపుల్ సెంచరీ మార్కుని తృటిలో చేజార్జుకున్నాడు. అస్సాంతో జరుగుతున్న మ్యాచులో జాదవ్ ఈ ఫీట్‌ని నమోదు చేశాడు. దాదాపుగా మూడేళ్ల పాటు జట్టులో స్థానం కోల్పోయిన ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్.. అరంగేట్ర మ్యాచులోనే విశ్వరూపం చూపించాడు. దీంతో మహారాష్ట్ర 9 వికెట్లు కోల్పోయి 594 పరుగులు చేయగలిగింది. అనంతరం ఇన్నింగ్సుని డిక్లేర్ చేసింది.