విశాఖ నుంచి త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తారని ఏపీ మంత్రి అమర్ నాథ్ తెలిపారు. మూడు రాజధానుల బిల్లును ప్రవేశ పెడతామని..అందులో ఎలాంటి అనుమానం లేదని పేర్కొన్నారు.రాజధానులకు ప్రజలందరి మద్దతు ఉందన్నారు. పాదయాత్రపై పేటెంట్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానిదని..వారు యాత్రల ద్వారా ప్రజల్లో భరోసా నింపారని వ్యాఖ్యానించారు. నారా లోకేశ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని..రాష్ట్రంలో ఏ సమస్య ఉందని యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు.