భారీ బడ్జెట్ చిత్రం RRR ఈ నెల 25వ తేదీన విడుదలవనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చకచకా పూర్తికావస్తున్నాయి. అయితే భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించడంతో స్పెషల్ షోలు, టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతినివ్వాలని దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య నిన్న ఏపీ సీఎం జగన్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో ఏపీలో స్పెషల్ షోలకు అనుమతినిచ్చింది ప్రభుత్వం, రూ.100 మేర టికెట్ ధరను పెంచుకునేందుకూ వీలు కల్పించిందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ప్రకటన వస్తుందని సమాచారం. కాగా టికెట్ రేట్లను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజగా జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే.