జగనన్న తోడు పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. చిరు వ్యాపారులకు రూ.10 వేల చొప్పున రుణ సాయం అందజేశారు. వర్చువల్‌గా నిధులు విడుదల చేసిన జగన్ పథకం గురించి మాట్లాడారు.’చిరు వ్యాపారులకు పెట్టబడి బారం కావొద్దనే జగనన్న తోడు తెచ్చాం. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. 3.5లక్షల మంది చిరువ్యాపారులకు కొత్తగా రూ.395 కోట్లు అందిస్తున్నాం. చిరువ్యాపారుల కష్టాలను దగ్గరుండి చూశా’ అని చెప్పుకొచ్చారు.