పుష్ప2లో సీనియర్ యాక్టర్ జగపతిబాబు కీలక రోల్లో నటించనున్నట్లు తెలిసింది. ఆయన కోసం ప్రత్యేక పాత్రను డైరెక్టర్ సుకుమార్ డిజైన్ చేసినట్లు సమాచారం. నేటి నుంచి వైజాగ్‌లో పుష్ప2 మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. అప్‌కమింగ్ షెడ్యూల్లో జగపతి బాబు పాల్గొంటారని టాక్. అయితే జగ్గుబాయ్ పాత్రపై మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక అప్డేట్ లేదు. కావాలనే జగపతిబాబు రోల్‌ను సస్పెన్స్‌లో ఉంచారని తెలిసింది.