తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధిష్ఠానంపై సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను చంపడానికి కేసీఆర్ ఎవరికి సుఫారీ ఇచ్చాడో తేల్చాలని కోరారు. సుఫారీ తీసుకుంది జగ్గారెడ్డా? ఉత్తమ్ కుమార్ రెడ్డా? తేల్చాలంటూ ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావెద్‌ను ఆయన ప్రశ్నించారు.