హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ ను శాశ్వతంగా రద్దు చేస్తూ మెట్రోపాలిటన్ జడ్జి జ్యోతిర్మయి తీర్పును వెలువరించారు. రెండు రోజుల జైలు శిక్షను కూడా విధించారు. అంతే కాకుండా మద్యం సేవించి వాహనాలు నడిపిన 80 మందికి ఫైన్లు కూడా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపినా కానీ పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. కొంత మంది నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడుపుతున్నారని అటువంటి వారిపై కూడా ఉక్కుపాదం మోపుతామని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ A.V రంగనాథ్ తెలియజేశారు.