• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గొర్రెకు జైలు శిక్ష విధించిన కోర్టు

    హెడ్డింగ్ చదివి అరే ఇదేం వింత అని అనుకోకండి. ఈ వింత ఘటన ఆఫ్రికాలోని దక్షిణ సూడాన్ లో జరిగింది. దక్షిణ సూడాన్ లో 45 సంవత్సరాల మహిళ మరణానికి కారణమైన ఓ గొర్రెకు అక్కడి కోర్టు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దక్షిణ సూడాన్ లోని ఓ మహిళను పొట్టేలు పరిగెత్తించి, పరిగెత్తించి చంపేసింది. దీంతో గొర్రెను అదుపులోనికి తీసుకున్న పోలీసులు, గొర్రెతో పాటుగా దాని యజమానిని కూడా కోర్టు ముందు హాజరుపరిచారు. విచారించిన న్యాయమూర్తి ఆ గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించాడు. గొర్రె యజమానిని నిర్దోషిగా తీర్పు చెప్పాడు. కానీ ఆ యజమాని బాధిత కుటుంబానికి ఆరు ఆవులను ఇవ్వాలన్నాడు. శిక్ష పూర్తయిన తర్వాత గొర్రె బాధిత కుటుంబానికి చెందుతుందని జడ్జి తీర్పు వెలువరించాడు.