ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు పాకిస్థాన్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి ఉండాల్సిన అవసరం ఉందని విదేశాంగ శాఖ ముఖ్యకార్యదర్శి జైశంకర్ అన్నారు. ఆ ఒత్తిడి తీసుకువచ్చేందుకు భారత్ నాయకత్వం వహిస్తుందని పేర్కొన్నారు. పాకిస్థాన్, ఇండియా మధ్య చర్చలనే అంశం క్లిష్టమైనదని వ్యాఖ్యానించారు. నుదుటి మీద తుపాకి పెడితే ఎవరైనా మాట్లాడతారా అని ప్రశ్నించారు. ఆసియా కప్ వివాదం స్పందించిన ఆయన టోర్నమెంట్లు వస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయమెంటో మీకు తెలుసని అన్నారు.