జక్కన్న బృందం ప్రస్తుతం RRR అవార్డుల పంటతో సంతోషంలో మునిగి తేలుతోంది. తాజాగా క్రిటిక్స్ చాయిస్ బెస్ట్ ఫారెన్ లాంగ్వెజ్ ఫిల్మ్ అవార్డు కూడా దక్కించుకుంది. అయితే దర్శకుడు రాజమౌళి మాత్రం వేరే విషయంలో సంతోషంగా ఉన్నారు. టైటానిక్, అవతార్ లాంటి అద్భుతాలు తెరకెక్కించిన జేమ్స్ కేమరూన్ RRRచూసి రాజమౌళిని ప్రశంసించారు. 10 నిమిషాల పాటు ఆయనతో ముచ్చటించడమే గాక.. తన భార్యతో కలిసి రెండోసారి సినిమా చూశానని చెప్పుకొచ్చారు. దీంతో ఆనందంతో ఆకాశానికెగిరిన జక్కన్న తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.