దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన జేమ్స్ సినిమాకు పాజిటివ్ వస్తుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో 4000 థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించింది ఈ సినిమా. అటు ఈ సినిమాకు ప్రీ బుకింగ్స్ కూడా భారీ స్థాయిలోనే వచ్చాయని టాక్ వస్తుంది. పునీత్ చివరి సినిమా కావడంతో కర్ణాటకలో వారం రోజుల పాటు కేవలం పునీత్ సినిమానే ప్రదర్శించనున్నారు.