జనసేన అధినేత పవణ్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వ తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆవేదనతో ఉన్నట్లు తెలిపారు. వైకాపా నేతలు ప్రజా సమస్యలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. తాను చంద్రబాబు దత్తత పుత్రుడిని కాదన్నారు. ఒకసారి జనసేన వైపు చూడాలని కోరారు. తన పొత్తులు ప్రజలతోనే అంటూ వ్యాఖ్యానించారు. దసరా తర్వాత ప్రజా సమస్యల పోరాటం కోసం రోడ్లపైకి వస్తామని వెల్లడించారు.