AP: ఉత్తరాంధ్ర వాసుల స్థితిగతులను తెలుసుకోవడమే లక్ష్యంగా జనసేన ‘యువశక్తి’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ మేరకు ఈ నెల 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. యువశక్తి గోడపత్రికను అధినేత పవన్ కళ్యాణ్ ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. ‘ఉత్తరాంధ్ర వాసుల సమస్యలు, ఉపాధి లేమి, వ్యాపార అవకాశాలు తదితరాలను తెలుసుకోవడమే ఈ సభ ఉద్దేశం. మన యువత.. మన భవిత అనేది ఈ సభ నినాదం. రాష్ట్రంలోని యువతీ, యువకులు అందరూ ఆహ్వానితులే. భారీగా తరలివచ్చి యువశక్తి సభను విజయవంతం చేయండి’ అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.