AP: కాపు రిజర్వేషన్ల కోసం దీక్షకు దిగిన మాజీ మంత్రి హరిరామ జోగయ్యకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జోగయ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్చలు జరపాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ‘జోగయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉంది. ఆయన వయసును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్చలు జరపాలి’ అని పవన్ స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో జోగయ్య నేటి నుంచి నిరవధిక దీక్షకు సిద్ధమయ్యారు. కానీ, ఆదివారం రాత్రే భగ్నం చేసి అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.