దేశీయ వాహన దిగ్గజం జావా యెజ్డి నుంచి జావా 42 మోడల్లో లిమిటెడ్ ఎడిషన్ బైక్ రాబోతోంది. స్పోర్ట్స్ స్ట్రైప్ ఆల్‌స్టార్ బ్లాక్ మోడల్‌పై జావా 42 తవాంగ్ ఎడిషన్ వస్తోంది. ఈ ఎడిషన్‌లో భాగంగా కేవలం 100 వాహనాలు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. 293 సీసీ లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ని దీనికి అమర్చారు. దీని ధర స్టాండర్డ్ జావా 42 కన్నా రూ.20వేలు అధికం. ఈ బైక్‌ని దక్కించుకున్న వారికి బ్రాంజ్ మెడాలియన్తో పాటు ప్రత్యేకంగా రూపొందించిన హెల్మెట్, జాకెట్‌ని అందించనున్నారు.