పంజాబ్ లోని అమృత్ సర్లో దారుణం జరిగింది. BSF శిబిరంలో ఓ జవాను కాల్పులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో తొటి సిబ్బంది ఐదుగురిని కాల్చి చంపాడు. అయితే ఆ సిబ్బంది కామెంట్లు చేస్తూ ఆటపట్టించడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఆ కాల్పులు జరిపిన జవాను పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.