నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్2 షోకు ఇద్దరు సీనియర్ భామలు రానున్నట్లు తెలుస్తోంది. నెక్ట్స్ ఎపిసోడ్‌కు జయప్రద, జయసుధలు గెస్ట్‌లుగా వస్తున్నట్లు టాక్. బాలయ్యతోపాటు వీరిద్దరి డేట్స్ చూసుకుని ఎపిసోడ్స్‌కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు మరో కుర్ర హీరోయిన్ కూడా వీరితో పాటు ఈ షోకు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా బాలకృష్ణ హోస్ట్ చేస్తుండటంతో అన్‌స్టాపబుల్2 షో దేశంలోనే టాప్ షోగా నిలుస్తోంది.