జయశంకర్ యూనివర్సిటీలో ర్యాగింగ్

yousay

హైదరాబాద్- ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. హాస్టల్ కు పిలిపించి తమపై సీనియర్లు వికృత చేష్టలు చేసినట్లు జూనియర్ విద్యార్థులు యాంటీ ర్యాగింగ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన యూనివర్సిటీ అధికారులు మొత్తం 20 మంది సీనియర్లపై చర్యలు తీసుకున్నారు. సివియర్ గా ర్యాగింగ్ చేసిన ఏడుగురు సీనియర్ విద్యార్థులను సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయనీయకుండా సస్పెండ్ చేశారు. మిగిలిన విద్యార్థుల హాస్టల్ అడ్మీషన్లను క్యాన్సల్ చేశారు.

Exit mobile version