JEE మెయిన్స్ 2022కి పరీక్షకు సంబంధించి NTA పలు మార్పులను చేసింది. పేపర్ IIలోని సెక్షన్ Bలో కూడా నెగెటివ్ మార్కింగ్ విధానం ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో పేపర్ 1లో కూడా తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధానం ఉంది. అయితే ఈ ఎగ్జామ్ ప్రస్తుతం ప్రాంతీయ భాషల్లో ఇంగ్లీష్ తోపాటు తెలుగు భాషలో కూడా నిర్వహించనున్నారు. సెషన్-1 జూన్ 20 నుంచి 29 జూన్ వరకు.. సెషన్-2 జూలై 21 నుంచి జూలై 30 వరకు జరగనుంది.