దేశవ్యాప్తంగా ఎల్లుండి నుంచి JEE మెయిన్ ప్రారంభం కాబోతోంది. మొత్తం 290 ప్రాంతాలతో పాటు విదేశాల్లోని 18 నగరాల్లో జనవరి 24, 25, 29, 30, 31 తేదీలతో పాటు ఫిబ్రవరి 1న NITల్లో బీటెక్‌లో ప్రవేశానికి పేపర్-1 పరీక్ష జరుగుతుంది. బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్-2 పరీక్ష ఈ నెల 28వ తేదీన ఉంటుంది. హాల్‌టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని NTA తెలిపింది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి మొదలయ్యే మెయిన్ చివరి విడతకు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. JEE మెయిన్ నుంచి 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు రాసేందుకు అర్హత సాధిస్తారు.