మార్చి 10న వెల్లడయిన ఎన్నికల ఫలితాలలో భాగంగా నవజోత్ సింగ్ సిద్దూకు పంజాబ్ ప్రజలు షాక్ ఇచ్చారు. అమృత్సర్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసిన ఆయన ఆప్ అభ్యర్థి జీవన్ జ్యోత్ చేతిలో ఓడిపోయారు. మరో సీనియర్ నేత బిక్రమ్ మజీతియాను ఆమె ఓడించారు. దీంతో ఇద్దరు సీనియర్ నేతలను ఓడించిన జీవన్ జ్యోత్ గురించి సెర్చింగ్ మొదలైంది. ఆమెను పంజాబ్ ప్రజలు ‘‘ప్యాడ్ వుమెన్ ఆఫ్ పంజాబ్’’ అని పిలుస్తారు. శ్రీ హేమకుంట్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా మహిళలు ఉపయోగించే శానిటరీ ప్యాడ్లపై గురించి అవగాహన కల్పిస్తుంటారు. ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకొని పేద, నిరక్షరాస్యులలో చైతన్యాన్ని కల్పించారు. ఈ కారణాలతో కాంగ్రెస్, శిరోమణి అకాళీదల్ వంటి పార్టీలను ప్రజలు ఓడించగలిగారు.