మంచు విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ సినిమా ట్రైలర్ ఈనెల 5న విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం ప్రకటించింది. ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై మరింత అంచనాలు పెంచింది. విడుదలైన రెండు పాటలు కూడా శ్రోతలను ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమాలో పాయల్ రాజ్పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి ఇషాన్ సూర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాను అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.
ఈ నెల 5న ‘జిన్నా’ ట్రైలర్ రిలీజ్

Courtesy Twitter:vishnumanchu