ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా కొత్తగా 27 నగరాల్లో జియో 5G సర్వీసులు ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లోని తాడిపత్రి, జగిత్యాల, కోదాడ, తాండూర్, జహీరాబాద్, నిర్మల్, కొత్తగూడెం, సిద్ధిపేట్, సంగారెడ్డి పట్టణాల్లో జియో 5G సేవలు విస్తరించింది. తెలంగాణలో అత్యధికంగా జియో 5G సేవలు విస్తరించడం విశేషం. కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 331 నగరాలు, పట్టణాల్లో జియో 5G సేవలు కొనసాగుతున్నాయి.