తన వినియోగదారులకు ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రసారం చేసేందుకు రిలయన్స్ జియో సన్నాహాలు చేస్తోంది. 2023 ఐపీఎల్ ప్రసార హక్కులను రిలయన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమలో తన కస్టమర్లకు ఉచితంగా మ్యాచ్ ప్రసారాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. తన మార్కెట్ వాటాను పెంచుకోవడం కోసమే రిలయన్స్ ఈ ఆలోచన చేస్తోంది. దీనివల్ల టీవీల్లో మ్యాచ్ చూసేవారు కూడా డిజిటల్‌కు మారతారని భావిస్తోంది.