ఓ యువకుడు డేటింగ్ యాప్‌లో చాట్ చేస్తూ జాబ్ కొట్టేశాడు. ఇందుకు సంబంధించిన ఫన్నీ పోస్ట్‌ను అతడు ట్విటర్లో పోస్ట్ చేశాడు. అద్నాన్ ఖాన్ అనే యువకుడు బంబుల్ డేటింగ్ యాప్‌లో ఉపయోగిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ స్టార్టప్ కంపెనీ హెచ్ఆర్తో పరిచయమైంది. తనను స్టార్టప్‌కు రికమెండ్ చేయాలని కోరాడు. దీంతో అతడిని ఇంటర్వ్యూకు పిలవడం, ఉద్యోగానికి ఎంపిక కావడం చకచకా జరిగిపోయాయి. దీనిపై అద్నాన్ ‘‘ జాబ్ కోసం మీరు లింక్డిన్ వాడతారు.. నేను బంబుల్ వాడాను.’’ అంటూ ట్వీట్ చేశాడు.