అంబుజా సిమెంట్స్ లో వాటాను కొనుగోలు చేసేందుకు జేఎస్‌డబ్య్లు గ్రూప్ తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇందుకోసం 7 బిలియన్ డాలర్లతో బిడ్ దాఖలు చేసేందుకు కంపెనీ సమాయత్తమైనట్లుగా సమాచారం. ఇందులో 4.5 బిలియన్ డాలర్లను సొంతంగా, మరో 2.5 బిలియన్ డాలర్లను ప్రైవేట్ ఈక్విటీ సంస్థల ద్వారా సమకూర్చుకోనుందని సమాచారం. అంబుజా సిమెంట్స్, ఏసీసీలో వాటాలను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్, దాల్మియా భారత్ గ్రూపులు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.