జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ పరిధిలో ఓ మైనర్ పై అత్యాచార ఘటనలో ఇవాళ మరో ఇద్దరు నిందితులు అరెస్ట్ అయ్యారు. దీంతో ఈ కేసులో మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే అరెస్టైన నిందితులు ప్రధాన రాజకీయ నేతల కుమారులు కావడం చర్చనీయాంశంగా మారింది. నిందితుల్లో ఏ1 సాదుద్దీన్ (MIM నేత కుమారుడు), ఏ2 ఉమేర్ ఖాన్ (ఎమ్మెల్యే సోదరుని కుమారుడు), మైనర్ 1 ( వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడు), మైనర్ 2 (MIM కార్పొరేటర్ కొడుకు), మైనర్ 3 ( సంగారెడ్డి మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ కుమారుడు) ఉన్నారు. మరోవైపు ఈ ఘటనపై రెండు రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని CS, DGPని గవర్నర్ తమిళిసై ఆదేశించారు.