జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ పరిధిలో మైనర్ పై అత్యాచారం కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రెండోసారి బాలిక వాంగ్మూలం, నిందితులు ఉపయోగించిన బెంజ్, ఇన్నోవా కార్లలో స్పెర్మ్ సహా పలు రకాల ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేయగా, మరో ముగ్గురు మైనర్లు జువైనల్ కేంద్రంలో ఉండగా మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో, ఫొటోలు ఇప్పటికే లీక్ అయ్యాయి. మరో నిందితుడు ఓల్డ్ సిటీ ఎమ్మెల్యే కుమారుడని సమాచారం. బాధితురాలు చెప్పిన ప్రకారం ఎమ్మెల్యే కుమారుడి పేరు కూడా FIRలో నమోదు చేస్తారని తెలుస్తోంది.