వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తుది తీర్పు ఇచ్చే వరకూ అవినాశ్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. సోమవారం ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే మంగళవారం అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకాకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. మరోవైపు సీబీఐ హత్య కేసు డైరీని సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించింది 35 మంది సాక్షుల స్టేట్‌మెంట్లు, పది డాక్యుమెంట్లు, హార్డ్‌డిస్క్‌లను కోర్టు ముందుంచింది.