AP: పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణకు బెయిల్ రద్దు చేయడాన్ని హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. నారాయణ బెయిల్‌ను రద్దు చేస్తూ చిత్తూరు తొమ్మిదో అదనపు జిల్లా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దీంతో బెయిల్ రద్దుపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం సబబు కాదని హైకోర్టు అభిప్రాయపడింది. బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వులో ఉంచింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
Hyderabad News Telangana
కేటీఆర్ అతి పెద్ద భూకుంభకోణం చేశారు: రేవంత్ రెడ్డి