వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించేందుకు U.K. ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈమేరకు అక్కడి హోం కార్యదర్శి ప్రీతి పటేల్ శుక్రవారం పేర్కొన్నారు. 2010, 2011లో ఆప్గాన్, ఇరాక్ యుద్ధాలకు సంబంధించి వేలాది రహస్య దౌత్య, సైనిక రహస్య పత్రాలను వికీలీక్స్ ప్రచురించింది. దీంతో అసాంజేను గూఢచర్యం చట్టం కింద విచారించేందుకు U.S దర్యాప్తునకు ఆదేశించింది. నేరం రుజువైతే అసాంజే 175 ఏళ్ల జైలు శిక్షను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ క్రమంలో అసాంజే అమెరికా నుంచి బ్రిటన్ చేరి 2019 నుంచి శరణార్థిగా ఉంటున్నాడు.