వికిలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే తాను శిక్ష అనుభవిస్తున్న జైలులోనే వివాహం చేసుకునేందుకు రెడీ అయ్యాడు. ఎప్పటి నుంచో తనతో డేటింగ్ చేస్తున్న స్టెల్లా మోరిస్‌ను అసాంజేను వివాహం చేసుకోనున్నారు. లండన్‌లో ఉన్న హై సెక్యూరిటీ జైలులో అసాంజే వివాహం జరగనుంది. 50 ఏళ్ల అసాంజే 2019 నుంచి జైలు జీవితం గడుపుతున్నాడు. అసాంజే ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో విధులు నిర్వర్తించినపుడు న్యాయవాద బృందంలో ఉన్న స్టెల్లాతో రిలేషన్షిప్ కంటిన్యూ చేశాడు. అసాంజే-స్టెల్లా జంటకు ఇద్దరు సంతానం కూడా ఉన్నారు.