దేశంలోని సౌత్ రాష్ట్రాల్లో క్రమంగా పార్టీ విస్తరణే లక్ష్యంగా BJP ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో పార్టీ ప్రాధాన్యం, కేంద్ర పథకాల గురించి మరింత మందికి చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో జూలై 3న హైదరాబాద్లో బీజేపీ భారీ సభను ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా సహా పలు రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. దీంతో ఈ సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సుమారు 10 లక్షల మంది కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రతి కుటుంబానికి ఆహ్వానం పంపాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. మరోవైపు 50 లక్షల ఆహ్వాన పత్రిలు కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో గతంతో పోలిస్తే బీజేపీ పుంజుకుంది.