బంగారం ధరలు ఇవాళ మళ్లీ తగ్గాయి. జూన్ 3 నాటికి హైదరాబాద్, ఢిల్లీలో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.52,470 ఉండగా, ప్రస్తుతం రూ.52,090కి చేరింది. మరోవైపు 22 క్యారెట్ బంగారం ధర రూ.47,740గా ఉంది. ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్లలో పసిడి ధరల హెచ్చుతగ్గులు, గ్లోబల్ మార్కెట్ల ప్రభావం నేపథ్యంలో గోల్డ్ రేట్లు తగ్గినట్లు తెలుస్తోంది. మరోవైపు సిల్వర్ ధర ప్రస్తుతం కిలో రూ.67,500గా ఉంది. ఢిల్లీ, ముంబయిలో కేజీ వెండి రూ.61,700గా ఉంది.