‘దాస్ కా ధమ్కీ’ చిత్రం మార్చి 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని మార్చి 17న నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే, ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్ రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆస్కార్ వేడుకల కోసం అమెరికాలో ఉంటున్నాడు. మార్చి 12న ఆస్కార్ ఈవెంట్ జరగుతుంది. ఈ వేడుక పూర్తి కాగానే భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉంది. విశ్వక్‌సేన్ డ్యుయల్ రోల్‌లో చేస్తుండటంతో ‘దాస్ కా ధమ్కీ’ చిత్రంపై అంచనాలు పెరిగాయి.
-
Screengrab Instagram: vishwaksens
-
Courtesy Twitter: ntr cult