బింబిసార పార్ట్-2లో ఎన్టీఆర్ ?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ ‘బింబిసార’. ఆగష్టు 5వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఈ సినిమా పార్ట్-2, 3, 4 కూడా ప్లాన్ చేశామని చెప్పాడు. అయితే పార్ట్-2లో ఎన్టీఆర్ ఉంటాడా అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమయం వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పటికైతే ఎలాంటి ప్లాన్ చేయలేదు అని చెప్పుకొచ్చాడు. దీంతో పార్ట్-2లో ఎన్టీఆర్ ఉంటాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా ఈ సినిమా ఒక టైం ట్రావెల్ నేపథ్యంలో సాగే ఫిక్షన్ మూవీ.

Exit mobile version