ట్విట్టర్లో కొన్ని ఫ్యాన్ వార్స్ మరీ జుగుప్సాకరంగా తయారవుతున్నాయి. సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకుని పోయి ఇష్టారీతిన హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా ట్విట్టర్లో #justiceforsangeeta ట్రెండ్ అవుతోంది. సంగీత అంటే తమిళ సూపర్‌స్టార్ విజయ్ సతీమణి. ఈ మధ్య వీరిద్దరూ విడాకులు తీసుకోబుతున్నారంటూ పుకార్లు వచ్చాయి. వీటికి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే వీరి కుటుంబంలో చిచ్చుకు.. కీర్తి సురేశ్ కారణమంటూ కొందరు ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. విజయ్, కీర్తి చనువుగా ఉండటం వల్లే వీరి కాపురం దెబ్బతింటోందని పోస్టులు పెడుతున్నారు. వీరికి పోటీగా విజయ్ ఫ్యాన్స్ #justiceforshalini అంటూ అజిత్ కుటుంబంపై పోస్టులు చేస్తున్నారు.