అంతరించిపోయిందనుకున్న ‘కలివి కోడి’ 1985లో కడప జిల్లాలోని ‘లంకమల’ అడవుల్లో దర్శనమిచ్చింది. కానీ దానిని శాస్త్రవేత్తలు చూసే లోపే చనిపోయింది. 1948 నాటికే చనిపోయిందనుకున్న ఈ పక్షి జాతి మళ్లీ కనిపించడంతో అప్పటినుంచి పక్షి శాస్త్రవేత్తలు వాటి జాడ కోసం అడవిలో అడుగడుగూ గాలిస్తున్నారు. ఎక్కువగా కలివి పొదల్లో ఉండటంతో దీనిని కలివి కోడి అంటారు. కంజు పక్షిని పోలి ఉండే దీని శాస్త్రీయ నామం ‘జోర్డాన్ కోర్సర్’. ముదురు గోధుమ రంగులో మెడలో దండ ధరించినట్లు చారలు ఉంటాయి. దీని కూత 200 మీటర్ల వరకు వినిపిస్తుంది. నేషనల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు కలివి కోడి కూతను విస్తృతంగా ప్రచారం చేయిస్తూ ఈ అరుదైన పక్షి కోసం వెతుకున్నారు.