ఆరో స‌బ్‌మెరైన్ ఆవిష్క‌ర‌ణ‌..రెండేళ్ల‌లో సేవ‌లు ప్రారంభం

© ANI Photo

ఫ్రెంచ్ సంస్థ నావల్ గ్రూప్ సాంకేతిక‌త‌తో భారతదేశంలో నిర్మించిన నావికాదళం ఆరవ, చివరి కల్వరి-క్లాస్‌ జలాంతర్గామి(submarine) వాగ్‌షీర్‌ను లాంచ్ చేశారు. బుధవారం ముంబైలోని మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL)లో దీన్ని ప్రారంభించారు. రెండేళ్లలో భారత నౌకాదళంలోకి ఇది అందుబాటులోకి రాబోతుంది.దేశాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇది సిద్ధ‌మ‌వుతుంద‌ని అధికారులు చెప్పారు. ప్రాజెక్ట్ 75 కింద రూ.23,562 కోట్లతో ఫ్రెంచ్ సంస్థ నావల్ గ్రూప్ సాంకేతిక‌త‌తో కల్వరి-క్లాస్ డీజిల్-ఎలక్ట్రిక్ అటాక్ సబ్‌మెరైన్‌లు నిర్మించారు. వాటిలో నాలుగు ఇప్పటికే నౌకాదళంలో చేరాయి. ఐదవ జలాంతర్గామి వగిర్ ప్రస్తుతం ట్రయల్స్‌లో ఉంది.

Exit mobile version