ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ నటిస్తున్న ‘భారతీయుడు 2’ సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే విక్రమ్ ఘన విజయం తర్వాత కమల్ ఈ చిత్రాన్ని తిరిగి తెరకెక్కించేదుకు సద్ధమవుతున్నాడు. శంకర్ ప్రస్తుతం రామ్‌చరణ్‌తో RC15 చేస్తుండగా కొంతకాలం దీన్ని పక్కన పెట్టనున్నాడు. ముందుగా భారతీయుడు 2లో మిగిలిపోయిన భాగం షూటింగ్‌ను పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు. కాజల్ కూడా సెప్టెంబర్ 13 నుంచి షూటింగ్‌లో పాల్గొంటుంది. ఈ విషయాన్ని ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో వివరించింది.