గత పదేళ్లుగా సరైన హిట్ లేక నిరాశలో ఉన్న లోకనాయకుడు కమల్‌హాసన్‌కు విక్రమ్ ఆ లోటును తీర్చింది. తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. దీంతో పాటు తెలుగు, హిందీలో కూడా సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ప్రస్తుతం దాదాపు రూ.400 కోట్లకు చేరువలో ఉంది. ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. కమల్ హాసన్‌తో పాటు ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతికి కీలక పాత్రలు ఇవ్వడం, సూర్య గెస్ట్ రోల్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ రిపీటెడ్‌గా ఈ సినిమాను చూస్తున్నట్లు తెలుస్తుంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంతో పాటు అనిరుద్ మ్యూజిక్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది.